05-08-2025 06:07:53 PM
టేకులపల్లి,(విజయక్రాంతి): తల్లిపాల వారోత్సవాలు భాగంగా టేకులపల్లి మండలం సులానగర్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. అక్కడున్న తల్లులకి ముర్రిపాలు ప్రాముఖ్యత, తల్లిపాలు ప్రాముఖ్యత వివరించారు. కేవలం ఆరు నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలని, తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం వల్ల బిడ్డ కలిగే లాభాలు తల్లి కలిగే లాభాల గురించి తెలిపారు. తర్వాత గర్భిణీలు బాలింతలకు బ్రెడ్డు పండ్లు పంపిణీ చేశారు.