calender_icon.png 6 August, 2025 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాతవాహనలో ఒక్క రోజు వర్క్ షాప్ కార్యక్రమం

05-08-2025 06:05:41 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాలులో నాక్ గుర్తింపులో భాగంగా నాక్ సంచాలకులు డా. శ్రీరంగ ప్రసాద్ అధ్యక్షతన కార్యశాలను నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాన్ని ప్రగతి పథంలో నడిపించాలంటే జాతీయస్థాయి నాక్ గుర్తింపు అవసరమని దీనివల్ల విశ్వవిద్యాలయ నాణ్యత పెరుగుతుందని అధ్యాపకులు మరింత పరిశోధన చేయడానికి తోడ్పడుతుందని, ఈ కార్యశాలను అధ్యాపకులు మరింత ఉపయోగకరంగా మార్చుకోవాలని అన్నారు.

తదుపరి కీలక ఉపన్యాసకులుగా విచ్చేసిన మౌలానా ఆజాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అభ్యాస ఆచార్యులు డాక్టర్ రమ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం సంస్థాగతమైన అభివృద్ధికై ప్రణాళికలు వేసుకోవాలని వాటి కొరకు కావలసిన మౌలిక విషయాలు నేర్చుకోవాలని, అభివృద్ధిపరమైన, దీర్ఘకాలిక లక్ష్యాలను ఉద్దేశాలను ద్యేయాలను ఏర్పాటు చేసుకోవాలని, సంపూర్ణ విద్య కొరకు పాటుపడాలని నాక్ గుర్తింపుకై ఒక స్పష్టమైన ముందుచూపు ఏర్పాటు చేసుకొని స్థిరమైన అభివృద్ధి కొరకు పాటుపడాలని దీనికై అధ్యాపకులు చాలా శ్రమించాలని అన్నారు.

మరొక కీలక ఉపన్యాసకులుగా ఉస్మానియా రిటైర్డ్ ఆచార్యులు లక్ష్మీపతిరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు ఒక ఖచ్చితమైన దృక్పథంతో ప్రమాణాలతో, ప్రపంచ కీర్తి కొరకు, విద్య నైపుణ్యాలకై సృజనాత్మకతతో నాయకత్వ లక్షణాలను చదువు ద్వారా విద్యార్థులకు పంపిణీ చేయడంతో పాటు మంచి విద్యార్థులను తయారు చేసుకోవడం కొరకు పాటుపడాలని నాణ్యమైన విలువలతో కూడిన పరిశోధనల కొరకు వివిధ పరిశ్రమల భాగస్వామ్యంతో ముందుకు సాగితేనే నాక్ గుర్తింపు వస్తుందని,  మంచి పరిశోధన శాలలు, గ్రంథాలయాలు, నైపుణ్యవంతమైన అధ్యాపకులను తయారు చేసుకోవాలని ఎల్లప్పుడూ నవీకరణతో ముందుకు సాగాలని అన్నారు. విశ్వవిద్యాలయ నాక్ సంచాలకులు డా. శ్రీరంగ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఒక్క రోజు కార్యశాలను మరింత ఉపయోగకరంగా మార్చుకోవాలని అధ్యాపకులు నైపుణ్యాలు, అభ్యాసాలను పెంచుకోవాలని ఉద్దేశంతో ఏర్పాటు చేశామని ఈ వనరులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.