12-07-2025 12:28:35 AM
దిశా సమావేశంలో సంక్షేమ పథకాలపై సుదీర్ఘ చర్చ
అదిలాబాద్, జూలై 11 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరెలా అధికారులు కృషి చేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ అధ్యక్షతన డిస్టిక్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘాంగ చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యా, వైద్యం, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, యువత నైపుణ్యభివృద్ధి, పీ.వీ.టీ.జీ వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. పథకాల అమలులో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
ఈ సమావేశంలో భోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్శి షా, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, డిఎఫ్‌ఓ ప్రశాంత్ బాజీరావుపాటిల్, జడ్పి సీఈఓ జితేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.