calender_icon.png 12 July, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలి

12-07-2025 12:26:55 AM

ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్

అదిలాబాద్, జూలై 11 (విజయక్రాంతి):  ఇల్లు లేని నిరుపేదలకు కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఇల్లు అందించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీరామ్ కాలనీలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను ఎమ్మెల్యే అందజేసి.

అదేవి ధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు నియోజకవర్గంలో దాదాపు 4,800 మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

రాజకీయాలకతీతంగా, పార్టీలకతీతంగా ఎవరైతే పేద వాళ్ళు ఉన్నారో వారికి పథకాలు అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సాధ్యమైనంత తొందరగా మంజూరైన ఇళ్లను పూర్తి చేసే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ధోని జ్యోతి, జోగు రవి, ప్రశాంత్, నరేష్, రాజేందర్, తదితరులు ఉన్నారు.