calender_icon.png 12 July, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడుల్లో రాగిజావ పెడ్తలే!

12-07-2025 12:29:27 AM

స్కూళ్లు తెరిచి నెల గడుస్తున్నా ప్రారంభంకాని పంపిణీ

ట్రస్టుతో విద్యాశాఖకు ఇంకా కుదరని ఒప్పందం

  1. విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారనే విమర్శలు
  2. ఊళ్లల్లో అల్పాహారం తీసుకోకుండానే బడులకు వస్తున్న విద్యార్థులు 
  3. మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఏమీ తినకుండానే చదువులు

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): పేద విద్యార్థులు ఆకలితో ఆలమటించకూడదనే సదుద్దేశంతో సర్కారు బడుల్లోని పిల్లల కు రాగిజావ పంపిణీ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. రక్తహీనత, పోషకాహార లోపం తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందజేసే ఉచిత రాగి జావ సరఫరా నిలిచి పో యింది. జూన్ 12 నుంచి ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి.

పాఠశాలలు ప్రారం భమై కూడా నెల రోజులవుతున్నా పంపిణీ జరగడం లేదు. దీనిపై నిర్ణయం తీసుకోవడంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు అలస త్వం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో చాలా మంది విద్యా ర్థులు ఉదయం పూట ఏం తినకుండానే స్కూళ్లకు వస్తుంటారు. ఇలాంటి వారికోసం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా వారికి వారంలో మూడు రోజులు ఉదయం పూట బెల్లంతో కలిపి రాగి జావ పెట్టాలని నిర్ణయించారు.

గత విద్యా సంవత్సరంలో ఏప్రిల్ వరకు సరఫరా చేయడంతో విద్యార్థులకు అప్పటి వ రకు పెట్టారు. కానీ ఈ విద్యాసంవత్సరానికి మాత్రం స్టాక్ రాకపోవడంతో విద్యార్థులకు రాగి జావ అందడంలేదు. దీంతో భోజనం చేయకుండా వచ్చే విద్యార్థులు మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఖాళీ కడుపుతోనే ఉంటున్నారని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. 

కుదరని ఒప్పందం..

బెంగుళూరు కేంద్రంగా ఉండే ఓ ట్రస్ట్ 2022-23 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో బెల్లం కలిపిన రాగి జావ ఉచితంగా అందించేది. రాగి మాల్ట్ పొ డిని ట్రస్ట్ వాళ్లు మండల విద్యాధికారి కార్యాలయానికి పంపిస్తారు. అక్కడి నుంచి దాన్ని విద్యాశాఖ అధికారులు పాఠాశాలలకు సరఫరా చేస్తారు. రాగి జావ, బెల్లం పొడిని వేడి నీటిలో వేసి కలిపి దాన్ని గ్లాసులో అందిస్తారు. గతంలో దీన్ని పూర్తి ఉచితంగా ఎంపి క చేసిన స్కూళ్ల వరకు ఆ ట్రస్టే సరఫరా చేసే ది. కేవలం కొన్ని స్కూళ్లలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 1 తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు అం దించాలని నిర్ణయం తీసుకొని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ట్రస్టు సరఫరా చేసే రాగి జావ, బెల్లం పొడిలో సగం ఖర్చును ట్రస్టు, మరో సగం రాష్ట్ర ప్రభుత్వం భరించేది. అయితే పీఎం పోషణ్‌లో భాగంగా కేంద్రమిచ్చే నిధులను రాగి జావ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. రాగి జావ సరఫరా చేయాలంటే ఆ ట్రస్టుతో ప్రభుత్వం ఎంవో యూ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎంవో యూ విషయంలో ఇంతవరకూ అధికారు లు ఎటువంటి నిర్ణ యం తీసుకోలేదు. దీనికి సంబంధించిన దస్త్రం విద్యాశాఖకు ఇప్పటికే చేరినా నిర్ణయం తీసుకోవడంలో అధికారు లు నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రస్టు సరఫరా చేసుందుకు ముందుకొస్తున్నా అధికారులెందుకు ఒప్పం దం చేసుకోవడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగా విద్యార్థులకు ఉద యం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో అందాల్సిన రాగి జావ అందకపోవడంతో సగం మంది విద్యార్థులు మధ్యాహ్నం వర కు ఏమీ తినకుండా పాఠాలు వినాల్సిన పరిస్థితి నెలకొంది.

కొన్ని చోట్ల టీచర్లే తెస్తున్నారు..

ఒక్కో విద్యార్థికి ఇచ్చే జావలో 10 గ్రాముల రాగి పొడి, అదే స్థాయిలో బెల్లం పొడి వాడనున్నారు. విద్యార్థులకు కోడిగుడ్డు ఇవ్వని రోజుల్లో రాగిజావ ఇస్తారు. నిబంధనల ప్రకారం వారానికి మూడు రోజులు రాగి జావ, మూడు రోజులు ఎగ్స్ ఇవ్వాలి. సోమ, బుధ, శుక్ర భోజనంలో ఎగ్స్, మంగళవారం, గురు, శనివారాల్లో రాగి జావ పెట్టాలి. ఐరన్, సూక్ష్మపోషకాలతో కూడిన పోషకాహారాన్ని అందజేయడంలో భాగంగా రాష్ర్టంలోని సర్కారు బడి విద్యార్థులకు రాగిజావను బ్రేక్‌ఫాస్ట్‌గా అందజేస్తున్నారు. బడులు ప్రారంభానికి ముందే సరఫరా కావాల్సి ఉన్నా రాగిజావ నేటికీ పంపిణీ కాకపోవడంతో పిల్లలు ఆకలితో ఉండడం చూడలేక కొన్ని చోట్ల హెచ్‌ఎంలు, టీచర్లే తీసుకొచ్చి విద్యార్థులకు పెడుతున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల ఉన్న పాత స్టాక్‌నే పెడుతున్నారు. ఇదే విషయంపై పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి వివరణ కోరగా రాగిజావకు సంబంధించి ఇంకా ఒప్పందం జరగలేదని, మరో వారం రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని.. పిల్లలకు రాగిజావను సరఫరా చేస్తామని ఆయన సమాధానమిచ్చారు. దీనికి ఎంత వ్యయమవుతోందో తర్వాత చెబుతామన్నారు.