calender_icon.png 25 December, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అశ్వాపురం మండలంలో బీఆర్‌ఎస్ ఘన విజయం

25-12-2025 12:00:00 AM

గులాబీ సేన సమష్టి కృషి ఫలితం

అశ్వాపురం, డిసెంబర్ 24 (విజయక్రాంతి) : మండలంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భారాస (బీఆర్‌ఎస్) అభ్యర్థుల ఘన విజయం గులాబీ సేన సమి ష్టి కృషి ఫలితమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారాస పార్టీ అధ్యక్షులు, పినపాక ని యోజకవర్గ మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. ఈ విజయం వెనుక అనేకమంది కార్యకర్తల అకుంఠిత దీక్ష, అలుపెరుగని శ్రమ, త్యాగాలు ఉన్నాయని ఆయ న స్పష్టం చేశారు.

బుధవారం అశ్వాపురం మండలం ఎస్కేటీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భారాస విజయోత్సవ సమీక్ష సమా వేశంలో నూతనంగా గెలుపొందిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ, ఇది ప్రజాస్వామ్యానికి కాకుండా అధికార పార్టీ బెదిరిం పుల పర్వానికి జరిగిన ఎన్నిక. అయినా కూడా ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా పార్టీ గెలుపు కోసం సైనికుల్లా పోరాడిన ప్రతి గులాబీ కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కరిస్తునన్నారు.

మండల వ్యాప్తంగా భారాస పార్టీ బలపరిచిన అభ్యర్థులను, వారికి మద్ద తు తెలిపిన వారిని అనేక రకాలుగా బెదిరించారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లను ర ద్దు చేస్తామని, ఇంటి ముందు వేసిన మెటీరియల్ను కూడా తీసుకెళ్తామని బెదిరించినా, వాటిని లెక్కచేయకుండా ఓటర్లు భారాస అభ్యర్థులపై నమ్మకంతో విజయం అందించారని తెలిపారు. అభివృద్ధే గులాబీ పార్టీ లక్ష్యమని, పార్టీ అధినేత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన మార్గంలోనే పాలన సాగాలన్నారు.

గ్రామాల్లో ఎక్కడా భేదాభిప్రాయాలకు తావు లేకుండా నిష్పక్షపా తంగా, పారదర్శకంగా పాలన అందించాలని, ప్రజలతో మమేకమై గ్రామాభివృద్ధిలో భాగస్వాములుగా మారాలని సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు సూచించారు. ప్రభుత్వంతో పోరాడి నిధులు తీసు కొచ్చి గ్రామపంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మొండికుంట సర్పంచ్ మర్రి సంధ్య మల్లారెడ్డిని రేగా కాంతారావు ఘనం గా సత్కరించారు.

గొల్లగూడెం ఉపసర్పంచ్ బొలినేని గణేష్ మాట్లాడుతూ, ఈ రోజు గొల్లగూడెం అంటే రేగా అడ్డాగా మారింది. ఈ విజయం వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు ఉన్నాయి. మా ఊరి కార్యకర్తలు, నాయకులు చేసిన త్యాగాలే ఈ ఫ లితానికి కారణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల భారాస పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్, పార్టీ ప్రధాన కా ర్యదర్శి మర్రి మల్లారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, సీనియర్ నాయకులు కందుల కృష్ణార్జునరావు, సూదిరెడ్డి గోపిరె డ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మునుగోటి ప్రమీల, భూక్యా చందు లాల్, కూరపాటి చలపతి, పాటి మన్మధరెడ్డి, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.