calender_icon.png 25 December, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

25-12-2025 12:00:00 AM

తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకుడు మోర రవి

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 24, (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాలలో నిరు ద్యోగాన్ని, పేదల వలసలను మరింతగా పెం చే.. కేంద్ర ప్రభుత్వ నూతన గ్రామీణ ఉపాధి హామీ చట్టంని ఉపసంహరించి,మెరుగైన సవరణలతో ’ఎంజి - నరేగా’ను సక్రమంగా అమలు చేయాలని తె లంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు మోర రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు.

బుధవారం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం  ను, వికసిత్ భారత్ గ్యా రంటీ ఆఫ్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్- గ్రామీణ్ ’ గా పేరు మా ర్పు చేయడంతో పాటు, ఈ చ ట్టాన్ని మరింతగా నీరుగార్చే చర్యలను ఉపసంహరించుకోవాలని కోరు తూ తెలంగాణ రైతుకూలీ సంఘం , ప్రగతిశీల మహిళా సం ఘం స్త్రీవిముక్తి సంఘటన జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(AO) అనంతరామ కృష్ణకు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మోర రవి మాట్లాడుతూ.. కొన్ని సవరణలతో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 16న పార్లమెంట్ ఉభయ సభలలోను ఉపాధి హామీ సవరణ బిల్లును ప్రవేశపెట్టిందనీ, తగిన చర్చకు అవకాశ మివ్వకుండానే, విపక్షాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండానే...(18వ తేదీ నాటికే) చట్ట రూపం తీసుకుందన్నారు.‘ఎం.జి నరేగా’ (గ్రామీణ ఉపాధి హామీ చట్టం) ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రకటిత లక్ష్యపు దరిదాపుల్లోకి కూడా చేరుకోక పోయినప్పటికీ, ఎన్నో అవకతవకలు లోటుపాట్లతో... దేశంలోని గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల ప్రజానీకానికి ఏదో ఉపశమనంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.

ఈ పథకాన్ని కేంద్రంలోని ఎన్డీఏ ప్ర భుత్వం మరింతగా నీరుగారుస్తోందన్నారు. ఉపాధి హామీ పథకంలో చెల్లించాల్సిన వేతనాలను ఇప్పటి వరకు 90 శాతం కేంద్రం, 10% ఆయా రాష్ట్రాలు భరిస్తుండగా, ప్రస్తుత చట్టంలో 60 శాతం ఖర్చులు మాత్రమే కేంద్రం భరిస్తామంటూ... రాష్ట్రాలపై మరింత భారాన్ని ఈ నూతన సవరణ చట్టం మోపుతున్నదనీ మండి పడ్డారు. వ్యవసాయ సీజ న్లో రెండు నెలల పాటు ఉపాధి హామీ పనులను నిలిపివేయాలని నూతన ఉపాధి హా మీ చట్టంలో కేంద్రం పేర్కొంటూనే... మరో వైపు సంవత్సరంలో పని దినాలను 125 రోజులకు పెంచుతున్నామని ప్రకటిస్తున్నదన్నారు.

వాస్తవంగా చేసిన పనులకుగాను ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన వేతనాలు, దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల బకాయిలున్నాయన్నారు. వేతన బకాయిలు రా బట్టేందుకు వ్యయ ప్రయాసలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి పనుల్లో మానవ శ్రమశక్తిని అధికంగా వినియోగించవలసి ఉండగా... అనధికారికంగానే యంత్రాల వాడకం అధికంగా ఉందన్నారు. కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చాక, కూలీల ఉపాధి అవకాశాలను ఇంకా కుదించివేసేలా యంత్రాల వినియోగాన్ని అధికారికంగానే 49 శాతానికి పెంచిందన్నారు.

గ్రామీణ పేదలందరకు భూమిపై హక్కు కల్పించి, రైతాంగం పండించిన పంటలకు మద్దతు ధర కల్పించి, గ్రామీణ ఉ త్పత్తులపై ఆధారపడిన వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను పెంపొందిచాలన్నారు. భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరిగి, గ్రామీ ణ పేదల వలసలు నిలిచి పోతాయన్నారు. కేంద్రం ముందుకు తెచ్చిన ’విబి జిరామ్’ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఉపాధి పొందటాన్ని హక్కుగా గుర్తించాలనీ, గత ఉపాధి హామీ పథకాన్ని మెరుగుపరిచి అమ లు చేయాలని, ఉపాధి హామీ కూలీల పాత బకాయిలన్నింటినీ తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు కూలీ సంఘం (ఏఐకేఎంకేఎస్) జిల్లా నాయకులు వీరనారాయణ చారి, కుం జ వెంకటేశ్వర్లు, ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీవిముక్తి సంఘటన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తోలేo మమత, కుంజ సోమక్క, గొం ది లక్ష్మి, బట్ట సూరమ్మ, గౌతమి, పద్మ తదితరులు పాల్గొన్నారు.