04-10-2025 07:34:02 PM
తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ మండలంలోని గుండ్రెడ్డిపల్లి, వెంకటయ పల్లి, కోనాయిపల్లి నర్సంపల్లి, గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ప్రతాప్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ముఖ్యంగా ఇందులో పట్టొల రాజిరెడ్డి, లంబ రమేష్, శ్రీనివాస్ రెడ్డి, కంకణాల పాండు, మన్నె కృష్ణ, ప్రశాంత్, వీరి మిత్ర బృందం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ జరగబోయే జెడ్పిటిసి ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలోని టిఆర్ఎస్ కార్యకర్త కష్టపడి పని చేయాలన్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పార్టీ కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేస్తే రాబోయే రోజుల్లో మంచి పదవులు పొందే అవకాశం ఉంటుందని ప్రతాప్ రెడ్డి అన్నారు.