calender_icon.png 27 October, 2025 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ ప్రచార దూకుడు

27-10-2025 01:17:17 AM

  1. మాగంటి సునీత గెలుపుకోసం కదంతొక్కిన మణికొండ శ్రేణులు 

షేక్‌పేట్‌లో బూత్ స్థాయిలో విస్తృత పర్యటన

మణికొండ, అక్టోబర్ 26, విజయక్రాంతి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార బరి హోరాహోరీగా మారింది. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రచారం పోటాపోటీగా సాగుతుండటంతో స్థానిక ప్రజలు సైతం నివ్వెరపోతున్నారు.ఈ ప్రతిష్టాత్మక ఎన్నికలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్ గెలుపు కోసం పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

ఇందులో భాగంగా బిఆర్‌ఎస్ మణికొండ మున్సిపాలిటీ మహిళా అధ్యక్షురాలు రూపారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం షేక్పేట్ డివిజన్లో పార్టీకి చెందిన మణికొండ కార్యకర్తలు భారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.అందులో భాగంగా బూత్ 24 లో నాయకులు జిషాన్, అజయ్, రూపా, బిందు, అశోక్, రవి, సాగర్, శ్రీకాంత్, రమేష్ పాల్గొన్నారు.

25 లో స్థానిక నాయకులు రవి, దాస్, ఆసిఫ్, ఇబ్రహీం, గుట్టమేది నరేందర్, షేక్ ఆరీఫ్, కిరణ్, బాబురావు ప్రచారం చేశారు. 26 లో స్థానికులు అంకమ్మ, జ్యోతి, పుష్ప, రాధిక, స్వప్న, వాసవి, వసంత్, నాయకులు ప్రభు, దేవి ప్రియ పాల్గొన్నారు.

29 లో స్థానికులు వెంకటేశ్, రాములు, కృష్ణా, యాదగిరి, ప్రభాకర్లతో పాటు సీనియర్ నాయకులు కుంభగల్ల ధనరాజ్, అందె లక్ష్మణ్ రావు, గోరుకంటి విఠల్, గడ్డమీది శ్రీనివాస్, వెంకటేశ్, తిరుపతి, శకీలా రెడ్డి పాల్గొన్నారు. 30లో వెంకటయ్య, మల్లేష్, యాది రావు, రత్నం, మొగిలి, ఎస్. మూర్తి, ఎస్. యాదగిరి, నవీన్ ఆలస్యం, శ్రీకాంత్ ఏరుపుల, బొడ్డు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారని ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న పార్టీ మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ తెలిపారు.