calender_icon.png 7 November, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహమత్‌నగర్‌లో బీఆర్‌ఎస్ విస్తృత ప్రచారం

07-11-2025 12:14:53 AM

  1. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకున్న పార్టీ అభ్యర్థి
  2. మాగంటి సునీత ప్రచారానికి అపూర్వ స్పందన

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 6 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రణరంగంలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రచారం హోరెత్తుతోంది.  దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వారసురాలిగా బరిలోకి దిగిన ఆయన సతీమణి, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగం టి సునీతకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. గురువారం రహమత్ నగర్ డివిజన్‌లో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో స్థానిక ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు.

ప్రచారంలో భాగంగా గడపగడపకు వెళ్లిన సునీతమ్మను చూసి స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు. మా నాయకుడు గోపన్న చేసిన అభివృద్ధి, మాకు అందించిన సహా యం ఎప్పటికీ మరువలేనిది. ఆయన చివరి శ్వాస వరకు మాతోనే ఉన్నారు. ఇప్పు డు ఆ కుటుంబానికి అండగా నిలబడటం మా బాధ్యత. ఈ ఉప ఎన్నికల్లో సునీతమ్మ ను భారీ మెజారిటీతో గెలిపించుకుని, ఆమె లో మా గోపన్నను చూసుకుంటాం అని పలువురు స్థానికులు ధీమా వ్యక్తం చేశారు.

ప్రజ ల ఆదరాభిమానాలు చూసి సునీత చలించిపోయారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, దాస్యం వినయ్ భాస్క ర్, పద్మా దేవేందర్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమా, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా, మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత, స్థానిక నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.