calender_icon.png 13 August, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోల్‌సేల్‌గా అమ్మకానికి బీఆర్‌ఎస్

28-07-2025 01:10:05 AM

- బీజేపీతో కేటీఆర్ ఒప్పందం 

- బండి సవాల్‌కు సమాధానం చెప్పాలి 

- కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్, బీజేపీలు వేర్వేరు కాదని తాము మొదటి నుంచి చెబుతున్నామని, ఆ రెండు పార్టీల మధ్య ఫెవికల్ బంధం ఉందని కాం గ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతిచ్చిందని, అప్పుడే ఆ రెండు పార్టీల మధ్య బంధం బయటపడిందన్నారు.

ఆదివారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీ డియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ను హోల్‌సేల్‌గా అమ్మడానికి కేటీఆర్ ఒప్పందం చే సుకున్నారన్నారు. ఈడీ, సీబీఐ కేసులు వాళ్ల కుటుంబసభ్యులపైన రాకుండా ఉంటే బీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చె ప్పిన విషయాన్ని ఆయన గుర్తు చే శారు.

సీఎం రమేశ్‌ను కేటీఆర్ కలి సింది నిజం కా దా? చర్చలు జరిగింది వాస్తవం కాదా? బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం కోసమే చర్చలు వా స్తవమేనని కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా ధృవీకరించారు కదా అని  అన్నారు. బండి విసిరిన సవాల్‌కు చర్చించేందుకు కేటీఆర్ ఎప్పుడు వెళ్లుతున్నారో చెప్పాలని డి మాండ్ చేశారు.

కంచె గచ్చిబౌలి భూముల్లో అవకతవకలు జరిగితే ఈడీ, సీబీఐ వచ్చేవి కదా అని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో అనేక పనులు ఆంధ్రా కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది మీరు కాదా? 8 మంది బీజేపీ ఎంపీ లు గెలవడానికి బీఆర్‌ఎస్సే కారణమన్నారు. ఒప్పందంలో భాగంగానే బీజేపీకి డమ్మీ అధ్యక్షుడిని నియమించారని విమర్శించారు.