calender_icon.png 28 October, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలను రౌడీలంటూ అవమానిస్తున్న బీఆర్‌ఎస్

26-10-2025 12:23:53 AM

  1. బీసీలను అవమానిస్తున్న బీఆర్‌ఎస్‌కు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి

బీసీలను అవమానించడం బీఆర్‌ఎస్‌కు అలవాటే

బీఆర్‌ఎస్‌పై 15 బీసీ సంఘాల పైర్

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

ముషీరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో బీసీలను అవ మానించడం బీఆర్‌ఎస్‌కు అలవాటుగా చేసుకుందని ఇందుకు నాటి ప్రొఫెసర్ జయశంకర్ నుండి మొదలుకుంటే నేటి నవీన్ యాదవ్ వరకు బీఆర్‌ఎస్ పార్టీ అహంకారం ఆధిపత్యంతో అవమానిస్తున్నదని  బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షు డు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీఆర్‌ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు.

ఈ మేరకు శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో 15 బీసీ సంఘాల నేతలు మీడి యా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడు తూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉన్నత విద్యావంతుడు బీసి సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్‌ను బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసిఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు కాంగ్రెస్ ఒక రౌడీకి టికెట్ కేటాయించిందని వారు అనడాన్ని బీసీ సంఘాలుగా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నా రు.

రాజకీయ నిరుద్యోగిగా ఉన్న కేసీఆర్ కు తెలంగాణ భావజాల ఉద్యమాన్ని అందించిన ప్రొఫెసర్ జయశంకర్ తన సొంత ఇంటినే బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి కేటాయించిన కొండ లక్ష్మణ్ బాపూజీ, కేసిఆర్‌కు రాజకీయంగా అండదండలు అందిం చిన టైగర్ నరేంద్ర, దేశిని చిన్న మల్లయ్య నుండి ఈటల రాజేందర్ వరకు వారిని ఉపయోగించుకుని తర్వాత అవమానకరమైన రీతిలో వ్యవహరించిన పార్టీ బీఆర్‌ఎస్ అని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

భూ కబ్జాలకు పాల్పడి సెటిల్మెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి అనేక మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలపై అక్రమ కేసులు బనాయించి అందరి జీవితాలతో ఆటలాడుకుని ఇద్దరు భార్యలతో రోడ్డుకెక్కి, బీఆర్‌ఎస్ పార్టీ కార్యాల యంలోని తన్నుకొని దౌర్జన్యానికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వాళ్ల దృష్టిలో మంచోడు, పేద ప్రజలకు అండగా నిలబడి అందరి కష్టసుఖాల్లో ఒకరిగా జీవిం చి తమ వృత్తిని నమ్ముకుని నిజాయితీగా జీవించిన బీసీ బిడ్డలైన చిన్న శ్రీశైలం యాద వ్, ఆయన కుమారుడు నవీన్ యాదవులను మాత్రం బీఆర్‌ఎస్ నేత కేసిఆర్ రౌడీ షీట్ లుగా పేర్కొనడం తెలంగాణ రాష్ట్రంలోని రెండున్నర కోట్ల మంది బీసీలను అవ మానించడమేనన్నారు.

బీసీల ఆత్మ గౌరవాన్ని కించపరుస్తూ దోరతనంతో కేసిఆర్ వ్యవహరిస్తున్నారని శ్రీనివాస్ గౌడ్  మండిపడ్డారు. బీసీలంతా ఏకమై వారి కుట్రలను ఎండగట్టి ఓటు అనే ఆయుధం ద్వారా బీఆర్‌ఎస్‌కి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో బుద్ధి చెప్పాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ ఏ కులాల అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం. బాగయ్య, బీసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు కేపీ మురళీకృష్ణ,

బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి. మణి మంజరి సాగర్, గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధీటి మల్లయ్య, విశ్వబ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షులు కవుల జగన్నాథం, గంగిరెద్దుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నరసింహ, సమత యాదవ్, లచ్చయ్య గౌడ్, గూడూరు భాస్కర్ మేరు, నరసింహ చారి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.