calender_icon.png 29 January, 2026 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి మృతి

29-01-2026 12:58:27 AM

వెల్దండ జనవరి 28: బంధువుల ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం చెందాడు. ఈ విషాద ఘటన బుధవారం హైదరాబాద్‌శ్రీశైలం జాతీయ రహదారిపై వెల్దండ మండలం నారాయణపూర్ గేట్ సమీపంలో చోటుచేసుకుంది.రంగారెడ్డి జిల్లా కడ్తాల్ చరికొండ గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్ (32) మహేశ్వర మండలంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం వెంకటాపూర్ గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యేందుకు కారులో బయలుదేరాడు.ఈ క్రమంలో కల్వకుర్తి వైపు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న డీసీఎం వాహనం ఎదురుగా వచ్చి ఢీకొనడంతో వెంకటేష్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర, కురుమూర్తి తెలిపారు.