17-12-2025 12:16:11 AM
గుమ్మడిదల మండల నాయకుల మర్యాదపూర్వక కలయిక
గుమ్మడిదల, డిసెంబర్ 16 :గ్రామస్థాయిలో బీఆర్‌ఎస్ పార్టీ మరింత పటిష్టంగా కొనసాగుతోందని మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. మంగళవారం గుమ్మ డిదల మండల పరిధిలోని నాలుగు గ్రామాల్లో విజయం సాధించిన సర్పంచ్లు,వార్డు సభ్యులు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి,బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి,మాజీ జెడ్పీటీసీలు కోలన్ బాల్ రెడ్డి,కుమార్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హరీష్ రావు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతంగా ముందుకు సాగుతోందని అన్నారు.గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసిన నాయకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో నూతన సర్పంచ్ లు,మంజుల సత్తయ్య,లావణ్య గోవర్ధన్ రెడ్డి,కొమ్ము శ్రీను,దుర్గా నర్సింగరావు,పార్టీ నాయకులు విజయ భాస్కర్ రెడ్డి,సంతోష్ రెడ్డి, హుస్సేన్, రామప్ప, పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి యాదవ్, దయానంద్, శ్రీనివాస్, శంకర్, పోచయ్య, మహేశ్వరి ఉమా రెడ్డి, విట్టల్ రెడ్డి, గోపాల్, యాదిరెడ్డి, మహేష్, ఆంజనేయులు, మంద భాస్కర్ రెడ్డి, ముద్రికచారి, కరుణాకర్ రెడ్డి, సాయి రెడ్డి, వెంకటేశం, విశాల్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి,తదితర ప్రధాన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.