calender_icon.png 17 December, 2025 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజల సహకారం అవసరం

17-12-2025 12:14:35 AM

మాదాపూర్ డీసీపీ రితిరాజ్

అమీన్పూర్, డిసెంబర్ 16 :సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని మాదాపూర్ డీసీపీ రితిరాజ్ కోరారు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ రితిరాజ్ మాట్లాడుతూ, సీసీ కెమెరాల ద్వారా నేరాలను నియంత్రించడంతో పాటు క్రైమ్ రేటు గణనీయంగా తగ్గుతుందన్నారు. ప్రతి కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటు అత్యంత అవసరమని, ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

మియాపూర్, చందానగర్, కొల్లూర్ తదితర ప్రాంతాల్లో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తారానగర్ మార్కెట్ నుంచి పటాన్చెరు ఇక్రిశాట్ వరకు ఏర్పాటు చేసిన ఈ 32 సీసీ కెమెరాలు 24 గంటల నిఘా ఉంచి ప్రజల భద్రతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ జగన్నాధ్తో పాటు మియాపూర్, కొల్లూర్, చందానగర్ సీఐ లు, ఎస్‌ఐ లు తదితరులు పాల్గొన్నారు.