09-12-2025 01:34:15 AM
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
చిన్న చింత కుంట, డిసెంబర్ 8: బిఆర్‌ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు అడ్డాకుల మండలం కందూర్ గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ ముఖ్య నాయకులు శ్రీ. రామలింగేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ దండు కృష్ణారెడ్డి , సీనియర్ నాయకులు మందడి జయసుందర్ రెడ్డి,
మూసాపేట్ మండలం సంకలమద్ధి గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ నాయకులు సింగిరెడ్డి ప్రదీప్ రెడ్డి, కృష్ణయ్య, బాలయ్య, పలువురు బిఆర్‌ఎస్ కార్యకర్తలు నేడు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఎమ్మెల్యే జియంఆర్ ఆహ్వానించారు.