calender_icon.png 9 December, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాసేవకే అంకితం

09-12-2025 01:35:44 AM

  1. సర్పంచ్‌గా గెలిపించండి నిత్యం మీ వెంటే 
  2. హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేయండి 

గోపాలపేట డిసెంబర్ 8:  ప్రజాసేవ కోసం మీ వెంటే ఉండి మీ సమస్యల పరిష్కారానికి పునాదినవుతానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి లోకా రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా గోపాలపేట మండలం తాడిపర్తి గ్రామంలో జోరుగా ప్రచారం చేపట్టారు. సర్పంచ్ అభ్యర్థి పేరి లోకా రెడ్డి గడపగడపకు వెళ్లి ప్రతి ఒక్కరిని కలిశారు 18 ఏళ్ళు నిండిన యువతి యువకుల నుంచి 99 ఏళ్లు నిండిన వృద్ధుల వరకు అభివాదం చేస్తూ తనకు అవకాశం కల్పించాలని కోరారు. విద్యావం తులకైనా నిరుద్యోగులకైనా సమస్య తలెత్తితే నేను వెంటనే మీ ముందుంటానని హామీ ఇచ్చారు.

ముఖ్యంగా గ్రామంలో కావలసిన వసతులు అన్ని కల్పించడానికి ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చి మీ సమస్యలను తీరుస్తానని తెలిపారు. నిత్యం ప్రతిరోజు మీ వెంటే ఉండి మీ పనులు పూర్తి అయ్యేవరకు మంచినీళ్లు కూడా తాగనని సర్పంచ్ అభ్యర్థి లోకా రెడ్డి లతో ఒట్టేసి చెప్పారు.  కాంగ్రెస్ సీనియర్ నాయకులు చంద్రయ్య చంద్రయ్య సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.