22-07-2024 03:56:37 PM
హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో బీఆర్ఎస్ చర్చించనుంది. రాష్ట్రంలోని శాంతి భద్రతల నిర్వహణ వైఫల్యంపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించనుంది. చేనేత కార్మికుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు చర్చించనున్నారు. ఆరు గ్యారంటీలు, రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్, పారిశుద్ధ్యంపై అసెంబ్లీలో చర్చించనున్నారు. జూలై 25వ తేదీన అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.