22-07-2024 04:42:47 PM
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణ మరోసారి వాయిదా పడింది. సోమవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కోర్టు విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం విధానం.. సీబీఐ కేసులో డీఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయ బృందం ఒక పిటిషన్‌ను సమర్పించింది. కవితపై సీబీఐ వేసిన ఛార్జిషీట్ ను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఢిల్లీ మద్యం కేసులో కవిత పాత్రపై సీబీఐ ఛార్జిషీట్ న దాఖాలు చేసింది. జూలై 26న కవితను వర్చువల్ గా కోర్టులో హాజరుపర్చాలని సీబీఐకి ఆదేశించింది. ఛార్జిషీట్ కాపీలను నిందితుల తరుఫు లాయర్లకు ఇవ్వాలని కోర్టు తెలిపింది. కవిత సహా మరో నలుగురి పాత్రపై జేన్ 7న సీబీఐ ఛార్జిషీట్ వేసింది.