calender_icon.png 23 July, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు.. నేడు లైబ్రరీల్లో ఆంక్షలు

23-07-2025 04:01:43 PM

హైదరాబాద్: ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు విధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు(BRS MLA Harish Rao) అన్నారు. మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో ఇచ్చారు. నేడు లైబ్రరీ ల్లో విద్యార్థులపై ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పాలన అనే ఏడో గ్యారంటీని మరచి ఎమర్జెన్సీ రోజులను తిరిగి తెస్తున్నారని ద్వజమెత్తారు. గ్రంథాలయాలను రాజకీయ వేదికలుగా మార్చిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ పార్టీదని కీలక వ్యాఖ్యలు చేశారు..

ప్రభుత్వ గ్రంథాలయాలపై నిషేధాజ్ఞలు విధించడాన్ని హరీష్ రావు ఖండించారు. తెలంగాణ నిరుద్యోగ యువత(Telangana unemployed youth) ఆగ్రహాన్ని అణచివేసే ప్రయత్నంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆంక్షలను ఉపయోగిస్తోందని ఆయన అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతలో ఉన్న అసమ్మతిని అణిచివేయడానికి ఇది ఒక సాధనంగా ఉందని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయాలు, ప్రజా గ్రంథాలయాలలో నిరసనలపై నిషేధాన్ని ఆయన ఎగతాళి చేశారు. ప్రభుత్వం తన నిషేధ ఉత్తర్వులతో నిరుద్యోగ యువతలో ఆందోళనను చల్లార్చలేమని అన్నారు. బదులుగా, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా ప్రభుత్వం ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేసి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌లను జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని మీ నాయకుడిని విద్యార్థులు నిలదీసినందుకు, ఈరోజు గ్రంథాలయాల్లో నిషేధాజ్ఞలు ఏర్పాటు చేస్తారా?, ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒక విధంగా, అధికారం పక్షంలోకి రాగానే మరొక విధంగా వ్యవహరిస్తారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఒక్క విద్యార్థులే కాదు, యావత్ తెలంగాణ మీరు ఇచ్చిన మోసపూరిత హామీల గురించి నిలదీస్తోందని స్పష్టం చేశారు.