calender_icon.png 14 September, 2025 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖైదీల్లో పరివర్తన తీసుకొస్తూ జైళ్ల శాఖ కృషి

05-12-2024 11:34:29 AM

హైదరాబాద్, (విజయక్రాంతి): ఖైదీల్లో పరివర్తన తీసుకొస్తూ, వాళ్ళలో నైపుణ్యాలు మెరుగుపరుస్తు జైళ్ల శాఖ కృషి చేస్తుందని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో జైళ్ల శాఖ లో 92 మంది జైల్ వార్డర్స్ సికా హైదరాబాద్ లో శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జైల్ వార్డర్స్ కు  మంత్రి పొన్నం ప్రభాకర్, జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా , హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్త తో కలిసి మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... పాసింగ్ ఔట్ పెరేడ్ తీసుకుంటున్న జైల్ వార్డర్స్ కి డిప్యూటీ వార్డర్స్ కి శుభాకాంక్షలు తెలిపారు. దేశ రక్షణలో బాధ్యత గల అధికారులుగా  ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 249 మంది  సత్ప్రవర్తన గల ఖైదీలను విడుదల చేసింద ని తెలిపారు.

ప్రొఫెషనల్ ఖైదీల పై కఠినంగా ఉంటూనే వాళ్ళలో మార్పు తీసుకురావాల నీ సూచించారు. ఖైదీలు వృత్తిలో నైపుణ్యాలు సాధించి జైళ్ల శాఖ 29 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసిందని తెలిపారు. జైల శాఖ పెట్రోల్ బంకుల్లో ఖైదీలు పని చేస్తు ఆర్థికంగా ముందుడగు వేస్తున్నారు. ఖైదీలు వివిధ వృత్తుల్లో నైపుణ్యం సాధించి వారు తయారు చేసిన వస్తువులను స్టాల్ లలో అమ్ముకొని వారికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. బుధవారం పెద్దపల్లి సభలో గ్రూప్ 4 ఉద్యోగులకు నియామక పత్రాలు అందించడం జరుగింది. ఏడాది కాలంలో 55 వేల ఉద్యోగాలను నియామకం చేయడం జరిగింది. పార్లమెంటు సభ్యుడుగా తెలంగాణ కోసం కొట్లడినం.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్నం. జైళ్ల శాఖ మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని మంత్రి కోరారు.