అసమ్మతి నేతలకు గులాబీ ఎర!

27-04-2024 03:02:33 AM

టికెట్లు దక్కని నాయకులతో రహస్య చర్చలు

సొంత పార్టీలో ఉండి తమ గెలుపునకు సహకరించాలని చీకటి ఒప్పందాలు 

పెద్దమొత్తంలో నగదు, నజరానాల ఆఫర్లు?

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాం తి): పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుపే లక్ష్యంగా గులాబీ పార్టీ అభ్యర్థులు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నా రు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల్లో ఉన్న అసమ్మతి నేతలను తమ వైపు తిప్పుకొనేందుకు రాజకీయ విద్యలు ప్రదర్శిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చి ఎంపీ టికెట్లు పొందినవారిపై, టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు, పాత క్యాడర్ అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. తమను కాదని రాత్రికిరాత్రికి వచ్చి పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏవిధంగా గెలుస్తారో చూస్తాం అంటూ మండి పడుతున్నారు. రాష్ట్రంలో అధికారం లేకపోయినా పార్టీ కోసం శ్రమించామని, అలాంటి తమకు ఎంపీ టికెట్లు ఇవ్వకుండా గతంలో అధికార పార్టీలో ఉండి తమ కార్యకర్తలను వేధింపులకు గురిచేసి అనేక కేసులు పెట్టి రాజకీయంగా ఇబ్బందులు పెట్టిన అభ్యర్థులకు సహకరించబోమని కుండ బద్దలు కొడుతున్నారు. ఇదే అదునుగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు ముందుగా అసమ్మతి నేతల సంఖ్య ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ నాయకులపై దృష్టి సారించారు. వారితో మంతనాలు జరుపుతూ సొంత పార్టీలో ఉండి తమ అభ్యర్థి గెలుపునకు సహకరించాలని కోరుతున్నారు. పెద్ద మొత్తంలో నగదు, నజ రానాలు ముట్టజెప్తామని ఒప్పందాలు చేసుకుంటున్నట్టు తెలిసింది. 

కాంగ్రెస్ తరఫున చేవెళ్ల నుంచి రంజిత్‌రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్, వరం గల్  నుంచి కడియం కావ్య, మల్కాజిగిరి నుంచి పట్నం సునీతామహేందర్‌రెడ్డి పోటీచేస్తుండగా, ఆ నియోజకవర్గాల నుంచి టికె ట్లు ఆశించి భంగపడ్డ నేతలు వారికి దూరం గా ఉంటున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొనడంలేదు. వీరితో బీఆర్‌ఎస్ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు చీకటి ఒప్పందా లు చేసుకుంటూ ఈసారి సహకరించాలి వేడుకుంటున్నట్టు సమాచారం. దీంతో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నట్టు హస్తం పార్టీలో చర్చ సాగుతున్నది. బీజేపీ తరఫున నాగర్‌కర్నూల్ నుంచి పోతుగంటి రాములు కుమారుడు భరత్‌ప్రసాద్, వరంగల్ బరిలో  అరూరి రమేశ్, మహబూబాబాద్ నుంచి సీతారాంనాయక్, నల్లగొండ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి, ఆదిలాబాద్ నుంచి గొడాం నగేశ్ పోటీ చేస్తుండగా, వీరంతా బీఆర్‌ఎస్ నుంచి కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నావారే. వీరు ఏవిధంగా విజయం సాధి స్తారో చూస్తామని ఆ పార్టీ స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

రాజకీయ భవిష్యత్తు..?

వలసవాదులకు టికెట్లు ఇస్తే పార్టీ ని నమ్ముకొని ఉన్న నాయకుల రాజకీయ భవిష్యత్తు ఏమిటని ప్రశ్ని స్తున్నారు. ఒకసారి ఓడిస్తే మళ్లీ ఇతర పార్టీల నాయకులకు టికెట్లు ఇవ్వరని పేర్కొంటున్నారు. అవసరమైతే బీఆర్‌ఎస్ పార్టీ గెలిచేలా చేస్తామని అంతర్గత సంభాషణల్లో వెల్లడిస్తున్నా రు. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తున్న స్టాటజీ బృందాలు ఇతర పార్టీల వ్యతిరేకుల ను గుర్తించి తమ అధినేతలకు సమాచారం అందిస్తున్నాయి. దీంతో గులా బీ పార్టీ పెద్దలు రంగంలోకి దిగి అసమ్మతి నేతలను తమ దారిలోకి తెచ్చుకొనేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు బీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.