calender_icon.png 2 December, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించి బీఆర్‌ఎస్ సత్తా చాటాలి

02-12-2025 02:03:00 AM

మహబూబాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి బీఆర్‌ఎస్ సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో సోమవారం సర్పంచ్ ఎన్నికల సన్నాహక సభలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించి, కెసిఆర్ హాయంలో చేసిన అభివృద్ధిని గడపగడపకు తెలిపి బీఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల ఎన్నికకు కృషి చేయాలన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం ఖాయమని, ఆ మేరకు మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.