18-09-2025 12:34:30 AM
అశ్వారావుపేట, సెప్టెంబర్ 17,(విజయ క్రాంతి) :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అనంతరం గ్రామం లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ లలో పనిచేస్తున్న డైలీ వేజ్,కంటినిజెంట్,వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరవధిక సమ్మెకు అశ్వారావుపేట మండల బి ఆర్ ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు రూ. 26400 వేల రూపాయలు వేతనం చెల్లించేవారని,కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే వేతనం నుండి కోతలు విధించడం చాలా దుర్మార్గపు చర్య అని,అన్నారు. ఇప్పుడు వేతనాని రూ. 11000 వేలకు కుదించడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డైలీ వేజ్ వర్కర్లు సమ్మె మొదలు పెట్టి 6 రోజులు అవుతున్న కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవటం చాలా బాధాకరమైన విషయం అని అన్నారు.విద్య వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని నీతి మాటలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ,పిల్లలకి వండి పెట్టే వారు సమ్మె చేస్తూవుంటే, పిల్లలకు అన్నం ఎవరు వండి పెడతారు.పెట్టే పిల్లలకి భోజనం ఎలా సమయానికి అందుతుందనేది ఆలోచనచేయక పోవడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని అన్నారు.తక్షణమే ప్రభుత్వం డైలీ వేజ్ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి జీవో నం.64 నీ ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
అలాగే వర్కర్లు మాట్లాడుతూ ఉదయం 4 గంటలకు వచ్చి,సాయత్రం వరకు పిల్లల బాగోగులు చూసుకుంటూ నిరంతరం హాస్టల్స్ లోనే గడిపే వర్కర్ల కష్టాన్ని గుర్తించి వారి న్యాయ సమస్యలని పరిష్కరించాలని కోరారు. ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు పేపర్లలో ఫోటోలకు పోజులివ్వటం డిల్లీ పెద్దలను మెప్పించడానికి సరిపోతుందని,ప్రజల కష్టాలను గాలికి వదిలేస్తున్నారని,రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అవిందని మండిపడ్డారు.
ఈ కార్యక్రమం లోజిల్లా అధికార ప్రతినిధి యూ ఎస్ ప్రకాష్ రావు మాజీ ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి, బరగడ.కృష్ణ,నియోజక వర్గ నాయకురాలు వగ్గేల.పూజ, మండల నాయకులు మందపాటి.రాజా మోహన్ రెడ్డి,మాజీ సర్పంచ్ నారం.రాజశేఖర్,అశ్వారావుపేట టౌన్ పార్టీ ప్రెసిడెంట్ సత్యవరపు.సంపూర్ణ, జుజ్జురపు. తదితరులు పాల్గొన్నారు.