08-08-2025 12:08:57 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కే ంద్రంలోని రైతువేదికలో గురువారం రేషన్ కార్డుల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భ ంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను ప్రస్తావిస్తుండగా నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చా ర్జి శ్యాంనాయక్ మధ్యలో కలుగజే సుకుని అడ్డుకోవడంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం జరిగింది. కోపోద్రిక్తురాలై నా కోవ లక్ష్మి వాటర్ బాటిల్‌ను శ్యాంనాయక్ పైకి విసిరింది.
దీంతో బీఆర్‌ఎస్, కా ంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇ రువర్గాల మధ్య అలజడి చెలరేగడంతో పోలీసులు కలగజేసుకొని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. పంపిణీ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. అధికార దాహంతో మహిళ ను అని చూడకుండా శ్యామ్‌నాయక్ అవమానపర్చాడని మండిపడ్డారు. రేఖశ్యాం నాయక్ 10 సంవత్సరాలు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పనిచేసి అవకాశం కల్పించిన కేసీఆర్‌పైనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడిందన్నారు.
శ్యాంనాయక్ తన పదవి కాలంలో ఎంతో మంది వాహనదారులను ఇబ్బందులకు గురి చేశారని, ఈ ప్రాంత ప్రజలు అది మర్చిపోరని చెప్పారు. శ్యాంనాయక్ మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో రే షన్ కార్డులు అందించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు రేషన్ కార్డులను అం దించడంతోపాటు సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే తనపై దాడికి దిగడం ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.