08-08-2025 12:08:20 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్‌వి కర్ణన్ గురువారం ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చుడి బజార్‌లో ఉన్న ప్రధాన ఈవీఎం గోదామును తనిఖీ చేశారు. గోదాం లోపల ఉన్న వస్తువుల నిల్వ ఉన్న భద్రత, స్థితిగతులు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. నిఘా నేత్రాల పనితీరు, గోదాం భద్రతను తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నిక సంఘం మార్గదర్శకాల మేరకు గోదాం వద్ద భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సిబ్బందికి సూచించారు.