calender_icon.png 4 August, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కనిపించదు

04-08-2025 12:54:53 AM

-కేసీఆర్ చేసిన ఐదు లక్షల అప్పుల భారం రేవంత్ సర్కార్ మోస్తోంది 

-పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 

-కాంగ్రెస్ పార్టీ విడగొట్టేది కాదు.. కలిపేది 

-మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్

 నిజామాబాద్ ఆగస్టు 3: (విజయ క్రాంతి): ‘తెలంగాణ కాంగ్రెస్ జనహిత పాదయాత్ర‘ లో  భాగంగా నిర్వహించిన  ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల  సమావేశంలో ముఖ్య అతిథులుగా మీనాక్షి నటరాజన్ హాజరై ప్రసంగించారు. స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారితో  పోరాటంలో పాదయాత్ర కాంగ్రెస్ కు గట్టి అనుబంధం ఉందన్నారు.

దేశానికి తెలిసి పోయిందని కాంగ్రెస్ పార్టీ విడగొట్టేది కాదని కలిపే పార్టీ అని అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు.  తెలంగాణలో వెనుకబడిన తరగతుల గణన ఎంపిక జన గణనతో సాధ్యమవుతుందని ఆమె అన్నారు.  బీహార్, ఉత్తర ప్రదేశ్ లో 1 లక్ష40 వేలకు పైగా ఓటర్లను తొలగించారని ఫలితంగా ప్రజలు ఓటు వేసే తమ హక్కును కోల్పోయార న్నారు.

పనంత బుల్డోజర్ ప్రభుత్వం చేసిందని ఆమె ఆరోపించారు బీసీలకు రిజర్వేషన్ తేవాలన్న దృఢ సంకల్పంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో జోడో యాత్ర నిర్వహిస్తోందని ఆమె అన్నారు. ఈనెల 5 6 7 తేదీలలో జూడో తెలంగాణ పెరియార్ రామస్వామి బాపూజీ భారత్ సంవిధాన్ బాటలో కేంద్ర ప్రభుత్వ పై ఒత్తిడి తేవడానికి ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు.

ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్య కార్యాలయం నుండి ఆదేశాలు వస్తున్నాయి యూపీ బీహార్ లో తొలగించిన లక్షల 40 వేల ఓట్లకు పైగా వారు స్థానికులు కాదని వారి ఓటు హక్కు తొలగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల రాజనీతి ఆర్థిక ప్రగతి సాధించడం అసాధ్యమని మీనాక్షి నటరాజ్ స్పష్టం చేశారు.

   పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 15% వరకు కొత్తవారికి అవకాశం ఇచ్చామని అలాగే ప్రస్తుతం 85% వరకు పాతవారికి కాంగ్రెస్లో పాదయాత్ర ఇచ్చామని కార్యకర్తల సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కొన్ని పత్రికలలో జనహిత పాదయాత్ర పై తప్పుడు ప్రచారం జరుగుతోందని పాదయాత్రకు అనుమతి లేకున్న ముఖ్యమంత్రి అడ్డు చెప్పిన కూడా చేస్తున్నామన్నట్టు ప్రచారాలు చేస్తున్నాయని ఇది పచ్చి అబద్ధం అన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి ఆయన మాట్లాడుతూ పార్టీ అంతర్గతంగా జరిపే సర్వేలో ఎవరు ప్రజలతో సన్నితంగా ఉండి ప్రజలకై పాటుపడుతున్నారు వారికి తప్పనిసరిగా ఆదరణ ఉంటుందని వారిని స్థానిక సంస్థలు ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తలకు హామీ ఇచ్చారు. కార్యకర్తలు సంఘటితంగా పని చేయడం వల్లే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని మరోమారు ఆయన స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతస్థాయిలో కార్యకర్తలు ప్రచారం చేయాల న్నారు. సన్న బియ్యం కళ్యాణ లక్ష్మి ఫ్రీ బస్ డబుల్ బెడ్ రూమ్ అంశాలను ప్రచారం చేయాలన్నారు 10 సంవత్సరాల ప్రభుత్వాన్ని కొనసాగించిన కేసీఆర్ ఒక్క బెడ్ రూమ్ కూడా పంపిణీ చేయలేదని ఆయన ఆరోపించారు. అన్నా చెల్లెలు మధ్యలో ఆస్తి తగాదాలు డిష్యుం డిష్యుం... పరిస్థితి నెలకొందని ఈ తగాదా తీవ్ర స్థాయికి చేరుకుం దని ఆయన తెలిపారు.

కెసిఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారన్నారు. హరీష్ రావు అదను కోసం ఎదురు చూస్తున్నాడని బిఆర్‌ఎస్ పార్టీ పని దాదాపుగా ముగిసినట్టే అన్నాడు. వచ్చే ఎన్నికల్లో పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఢిల్లీలో జరిగే బిసి ధర్నా కేంద్రానికి కనువిప్పు కావాలని ఈ ధర్నాకై ప్రతి కార్యకర్త హాజరు కావాలని మహేష్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ  తాము అధికారంలో ఉన్నామంటే కార్యకర్తల పది సంవత్సరాల పోరాటం,  వారి కష్ట ఫలితమే అన్నారు. ఇప్పటివరకు కార్యకర్తలు మా కోసం కష్టపడ్డారు ఇప్పుడు మీకోసం తిరిగి కష్టపడి మిమ్మల్ని నాయకులుగా చేయడం మా బాధ్యత అని ఆయన కార్యకర్తలకు హామీ ఇచ్చారు.

రాహుల్ గాంధీ 4,వేల కి.మీ ,పైగా పాదయాత్ర చేసి దేశవ్యాప్తంగా ప్రజల మనసులను అర్థం చేసుకుని, తెలంగాణ ప్రజల  కావలసిన పథకాలను రూపొందించి అందిచారన్నారు. వెనుకబడిన వర్గాలకు రాజకీయ అధికారం కల్పించడం లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని షబ్బీర్ అలీ తెలిపారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు మీనాక్షి నటరాజన్ , మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్రను ప్రారంభించా కొందరు పనిగట్టుకొని కొన్ని పత్రికలు తప్పుడుగా ప్రచారం చేస్తున్నాయన్నారు ఆ ప్రచారాన్ని ఆయన ఖండించారు.

ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు తెలుపుతూ ప్రజా పాలన అందివ్వడానికే ఈ పాదయాత్ర కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొంది పార్లమెంట్‌లో ఆమోదింప చేయడానికి ఈనెల 5వ తారీఖు నుండి ఢిల్లీలో ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నాం. రాష్ట్రంలో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. దాని రద్దు చేసే కుట్రలు జరిగిన కోర్టు ద్వారా దాన్ని కొనసాగిస్తున్నాం.

అణగారిన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిరుపేదల ఓటు హక్కును తొలగిస్తోందని, దేశ సంపదను అంబానీ, అదానీ వంటి ఉన్నత వర్గాలకు దోచిపెడుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో. జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కార్. ఎమ్మెల్యేలు, సుదర్శన్ రెడ్డి,  భూపతిరెడ్డి, లక్ష్మీ కాంతారావు, రాష్ట్ర కోపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ తాహెర్ బిన్ హాందాన్,బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి ,ఏనుగు రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.