04-08-2025 12:53:49 AM
అక్రమంగా తరలిస్తున్న ఇసుక డీసీఏం వాహనాన్ని పట్టుకున్న ఏటూరునాగారం పోలీసులు
ఏటూరునాగారం,ఆగస్టు3(విజయక్రాంతి) :అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి సమయంలో ఇసుకను తరలిస్తున్న డీసీఏం వాహనాన్ని ఏటూరునాగారం పోలీసులు పట్టుకున్నారు. మండల కేంద్రానికి చెందిన కొంత మంది వ్యక్తులు గత కొంతకాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక తరలిస్తున్నామనే సాకుతో మండల కేంద్రంలోని జంపన్నవాగు నుండి ఇసుకను తరలిస్తున్నారు.
ఈ ఇసుకను వేరొక ప్రదేశంలో రహస్యంగా డంప్ చేసి అక్కడి నుండి అర్ధరాత్రి సమయంలో అధికారులు, స్థానిక ప్రజల కళ్లు కప్పి అక్రమంగా పట్టణాలకు తరలిస్తూ సోమ్ము చేసుకుంటున్నట్లు అధికారులకు సమాచారం అందినట్లు తెలుస్తుంది.
అయితే ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఇదే తరహలో ఇసుక తరలిస్తున్నారనే నమ్మదగిన సమాచారంతో ఏటూరునాగారం ఎస్సె రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఆకస్మీక తనికీలు నిర్వహించి, అక్రమంగా ఇసుకను తరలిస్తున్న డీసీఏం వాహనాన్ని పట్టుకుని ఏటూరునాగారం పోలిస్ స్టేషన్కు తరలించారు.