calender_icon.png 2 September, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీబీఐ దర్యాప్తుతోనే వాస్తవాలు వెలుగులోకి..

02-09-2025 12:05:30 AM

-బీఆర్‌ఎస్ కాళేశ్వరాన్ని ఏటీఎంలా మార్చుకుంది

-బీజేపీ ద్వారానే బీసీలకు న్యాయం

-ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్

-బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ బీజేపీలో చేరిక

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవి నీతి, అక్రమాలు సీబీఐ విచారణతోనే వెలుగులోకి వస్తాయని, ఇన్ని రోజులకు సీఎం రేవంత్‌రెడ్డికి ఈ విషయంలో జ్ఞానోదయమైందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. బీజేపీ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని, యావత్ బీసీ సమాజమంతా నరేంద్రమోదీ నాయకత్వం పట్ల నమ్మకం, విశ్వాసంతో ఉందని తెలిపారు.

ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు, కాళేశ్వరం ప్రా జెక్టు అవినీతి కేసు విషయంలో కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు రేవంత్ సర్కారు వ్యవహరించిందన్నారు. దొంగలుపడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు, సీఎం రేవంత్‌రెడ్డికి 22 నెలల తర్వాత ఇప్పుడు కను విప్పు కలిగిందన్నారు. పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్‌రావు సమక్షంలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ బీజేపీలో చేరిన సందర్భంగా సో మవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

బీజేపీ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందన్న విషయాన్ని బీసీ సమాజం మొత్తం విశ్వసిస్తోందని చెప్పారు. బీసీల హ క్కులు, సంక్షేమం, అభ్యున్నతి కోసం బీసీలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. అందు కే ఆర్ కృష్ణయ్య, వకుళాభరణం కృష్ణమోహన్, మాజీ ఎంబీసీ చైర్మన్‌గా పనిచేసిన తాడూరి శ్రీనివాస్ బీజేపీలో చేరారని పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణమని తీవ్రంగా విమర్శించారు. రూ.38 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టును లక్ష కోట్ల పైచిలుకు నిధులతో నిర్మిస్తామని చెప్పడమే ఈ కుంభకోణానికి సాక్ష్యంగా పేర్కొన్నారు.  ఈ విషయంలో బీజేపీ మొదటి నుంచే చా లా స్ప ష్టంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కులగణన చేసి, బీసీ రిజర్వేషన్లు 23 నుంచి 42 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని లక్ష్మణ్ గుర్తు చేశారు.

20 నెలలు గడిచినా కాంగ్రెస్ చిత్తశుద్ధి చూపలేదని ఆరోపించారు. 22 మాసాలు మీనమే షాలు లెక్కిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేసే చట్టసవరణను చేయలేదన్నారు. కాంగ్రెస్ సర్కా ర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శా తం రిజర్వేషన్లు ఇవ్వకుండా తప్పించుకొనే అవకాశం లేదన్నారు. కులగణన సర్వే ఎవరికి మేలు చేసేందుకని ప్రశ్నించారు. 12 శా తం ముస్లింలలో 10 శాతాన్ని బీసీ జాబితా లో చేర్చే ప్రయత్నం చేశారని విమర్శించారు. గతంలో 51 శాతం ఉన్న బీసీలను 46 శాతానికి కుదించారని.. మా లెక్కలు ఏంటి, మా జనాభా ఎంత అంటూ బీసీలతో పాటు సంచార జాతులు కూడా ప్రశ్నిస్తున్నాయన్నారు. సామాజికంగా బీసీ కులాల లెక్కలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టకుండా, నిగూఢంగా ఉంచుతూ బీసీలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావ్ పాటిల్, డాక్టర్ పాల్వాయి హరీశ్‌బాబు, ధన్‌పాల్ సూర్యనారాయణగుప్తా, మాజీ ఎంపీ సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా కాళేశ్వరం ప్రాజెక్టు..

కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకొని, తెలంగాణలో కేసీఆర్ కుటుం బం వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం గతంలోనే చెప్పిన విషయాన్ని లక్ష్మణ్ గుర్తుచేశారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి కాళేశ్వరం అవినీతి దేశంలోనే అతి పెద్ద స్కామ్ అని, ఆధారాలు ఉన్నాయని, అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో నిగ్గుతేల్చి మెక్కిన సొమ్మంతా కక్కిస్తామని చెప్పి రూపాయి కూడా కక్కించలేదన్నారు. కాలయాపన కో సం పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. సీబీఐ దర్యా ప్తు కోరితే బీజేపి- బీఆర్‌ఎస్‌కు మేలు చేస్తుందని రేవంత్ రెడ్డి తప్పుడు ప్ర చారం చేశారని విమర్శించారు. అధిష్ఠానం ఒత్తిళ్లకు లొంగి, సీఎం రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్‌తో లోపాయికారీ, చీకటి ఒప్పందం చేసుకున్నారని... ఇదే వారి రహస్య ఎజెండా అని లక్ష్మ ణ్ విమర్శించారు.