27-01-2026 12:35:09 AM
డబ్ల్యూపీఎల్ చరిత్రలో తొలి శతకం
ఆర్సీబీని చిత్తు చేసిన ముంబై
ప్లే ఆఫ్ ఆశలు సజీవం
వడోదర, జనవరి 26 : వుమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో తొలి శతకం నమో దైంది. ముంబై ఇండియన్స్ బ్యాటర్ నాట్ సీవర్ బ్రంట్ సెంచరీతో దుమ్మురేపింది. రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడిన బ్రంట్ 57 బంతుల్లో 100 నాటౌట్ (16 ఫోర్లు, 1 సిక్స్)గా నిలిచింది. డబ్ల్యూపీల్ చరిత్రలో సెచంరీ చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె సెంచరీ ఇన్నింగ్స్‌తో భారీస్కోరు చేసిన ముంబై, ఆర్సీబీని నిలువరించి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై త్వరగానే ఓపెనర్ సాజన వికెట్ కోల్పోయింది. అయి తే హీలీ మాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్ చెలరేగిపోయారు. వీరిద్దరూ 131 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పారు. ఈ క్రమంలో మాథ్యూస్ (56) హాఫ్ సెంచరీ చేయగా.. చివర్లో బ్రంట్ సెంచరీతో రెచ్చిపోయింది. హర్మన్ ప్రీత్ కౌర్ 20 పరుగులు చేయగా.. బ్రంట్ 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఆర్సీబీ బౌలర్లలో లారెన్ బెల్ 2 , డిక్లెర్క్, శ్రేయాంకా పటేల్ తలో వికెట్ పడగొట్టారు. 200 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలోనే చేతులెత్తేసింది.
కేవలం 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. స్మతి (6), హ్యారిస్ (15), జార్జియా (9). గౌతమి నాయక్ (1), రాధా యాదవ్ డకౌటయ్యారు. తర్వాత రిఛా ఘోష్ హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. మిగిలిన వారి నుంచి సపోర్ట్ దక్కలేదు. ఈ విజయంతో ముంబై ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీకి ఇది వరుసగా రెండో ఓటమి.