27-01-2026 12:40:48 AM
శ్రేయాస్ అయ్యర్ కొనసాగింపు
ముంబై, జనవరి 26 : టీ20 వరల్ కప్‌కు ముందు భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు సంబంధించి బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లకు స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ జట్టుతోనే కొనసాగనున్నాడు. యువ ప్లేయర్ తిలక్ వర్మ ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. తిలక్ వర్మ ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో కోలుకుంటున్నాడు. శస్త్రచికిత్స తర్వాత మళ్లీ ఫిజికల్ ట్రైనింగ్ ప్రారంభించానీ బోర్డు వర్గాలు తెలిపాయి. అయితే పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి తిలక్ వర్మకు మరికొంత సమయం పట్టనుందవి వెల్లడించాయి.
దీంతో టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ నిర్ణయించింది. ఇప్పటికే కివీస్‌పై సిరీస్ కైవసం చేసుకోవడంతో ప్రస్తుతం ఉన్న జట్టునే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన తర్వాత ఫిబ్రవరి 3న ముంబైలో తిలక్ వర్మ తిరిగి భారత జట్టుతో చేరనున్నాడు. టీ20 వరల్ కప్ 2026 వార్మప్ మ్యాచ్ కంటే ముందే అతను జట్టుకు అందుబాటులోకి వస్తాడని బోర్డు స్పష్టం చేసింది. దీంతో శ్రేయాస్‌నే కొనసాగించనున్నారు.
తొలి మూడు మ్యాచ్‌లలో అదరగొట్టిన టీమిండియా 3 ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే జట్టు కాంబినేషన్ కారణంగా శ్రేయస్ అయ్యర్‌కు తుది జట్టులో అవకాశం దక్కలేదు. ప్రస్తుతం తిలక్ వర్మ స్థానంలో జట్టు యాజమాన్యం ఇషాన్ కిషన్‌ను మూడో స్థానంలో ఆడిస్తోంది. ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో మిగిలిన రెండు మ్యాచ్‌లలో శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.