30-08-2025 12:08:43 AM
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్
ఖైరతాబాద్; ఆగస్టు 29 (విజయక్రాంతి) : ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారం సాధించడమే బీఎస్పీ అంతిమ లక్ష్యమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ పార్టీ శ్రేణులకు తెలిపారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ అథర్ సింగ్ రావుతో కలిసి అధికా రికంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందని బలం గా నమ్మి, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు 36 మంది బీఎస్పీ ఎంపీలతో మద్దతు తెలిపిందని గుర్తుచేశారు. కాన్షీరామ్ బహుజను లకు జరుగుతున్న అన్యాయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఉత్తరప్రదేశ్లో బీఎస్పీని బలమైన రాజకీయ శక్తిగా మార్చి, మాయావతిని నాలుగు సార్లు ముఖ్యమంత్రిని చేశారని తెలిపారు.
తెలంగాణ ఉద్యమం అగ్రవర్ణాలు చేసిన పోరాటంగా అభివర్ణించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికిన అనంతరం అక్కడి నుంచి కార్లతో భారీ ర్యాలీగా బయలుదేరి ట్యాంక్ బండ్ వద్ద తెలుగుతల్లి ఫ్లై ఓవర్ కింద ఉన్న డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, అనంతరం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు.
రెండు రాష్ట్రాల ఇంచార్జ్ గా ఎం.బాలయ్య, స్టేట్ సెంట్రల్ కోఆర్డినేటర్లుగా దాగిళ్ళ దయానంద్, నిషాని రామచం దర్ ప్రధాన కార్యదర్శులుగా బోయిని చం ద్ర శేఖర్ ముదిరాజ్, బోడపట్ల ఈశ్వర్ లతో పాటు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.