30-08-2025 12:06:11 AM
రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 29 (విజయక్రాంతి)రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పేదరిక ని ర్మూలన సంస్థ సీఈవో హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేశారు. జిల్లాలోని ఎల్ 2, ఎల్ 1, ఎంఎస్ సీసీఎస్ 53 మంది ఉద్యోగులకు శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదా యం మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కౌన్సిలింగ్ నిర్వహిం చి, బదిలీ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శేషాద్రి,,అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.