15-12-2024 05:05:14 PM
జగిత్యాల: జగిత్యాల జిల్లా సారంగాపూర్ లో ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఈ పర్యటనలో ఎమ్మెల్సీ కవిత కస్తూర్బ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ... పెంచిన డైట్ ఛార్జీలను కస్తూర్బా పాఠశాలలకు వర్తింపజేయాలని పేర్కొన్నారు. అధేవిధంగా కస్తూర్బ విద్యార్థులందరికీ పౌష్టికాహరం అందించాలని, సర్వశిక్ష అభియాన్ పాఠశాల టీచర్లను క్రమబద్దీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం హామీ మేరకు టీచర్లను క్రమబద్దీకరించాలని, గురుకుల పాఠశాలల లక్ష్యాన్ని దెబ్బతీయకూడదని, విద్యార్థులకు ఆహర విషయంలో ఏలాంటి రాజీపడకూడదని వెల్లడించారు. జగిత్యాల జిల్లా ధరూర్ వద్ద పర్యటించిన కవిత తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు.