01-09-2025 12:47:33 AM
భూత్పూర్, ఆగస్టు 31 :భూత్పూర్ మం డల పరిధిలోని మద్దిగట్ల గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ప్రతిష్టించిన గణనా థుడు గత ఐదు రోజుల నుంచి నిత్య పూజ లు అందుకుంటున్నాడు. ఆదివారం నిమజ్జనం సందర్భంగా వినాయకుడి లడ్డు వేలా న్ని నిర్వహించారు.
ఈ లడ్డు వేలంలో రూ. 1 లక్ష 8 వేలకు అదే గ్రామానికి చెందిన కే సి రెడ్డి పురేందర్ రెడ్డి లడ్డును దక్కించుకున్నారు. అనంతరం దేవాలయ పెద్దలు ఆయ నకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేసి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తోపాటు గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.