calender_icon.png 30 July, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలి

29-07-2025 07:44:23 PM

ఇంచార్జ్ మంత్రి సీతక్కకు డాక్టరేట్స్ ఆసోసియేషన్ వినతి..

కామారెడ్డి (విజయక్రాంతి): గత కొన్నేళ్లుగా కామారెడ్డి జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కల కలగానే మిగిలిపోతుంది. గతంలో పిసిసి అధ్యక్షుని హోదాలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ విశ్వ విద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారని వారు తెలిపారు. ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి నివేదిక అందజేసినప్పటికీ తాత్సరమవుతోందని మంత్రి సీతక్క(Minister Seethakka)కు తెలిపారు. క్యాబినేట్ సమావేశంలో పాలమూరు జిల్లాకు కామారెడ్డి జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తారని జిల్లా ప్రజలు, విద్యార్థులు ఆశగా ఎదురుచూశామన్నారు. ప్రభుత్వం కామారెడ్డి జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ డాక్టరేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డా. తంగళ్ళపల్లి సంతోష్ గౌడ్, డా.సరిత, డా. రాహుల్, డా. రమాదేవి, దిలీప్ కుమార్ తదితరులున్నారు.