29-07-2025 12:52:02 PM
న్యూఢిల్లీ: లోక్ సభలో ఆపరేషన్ సింధూర్(Operation Sindoor)పై చర్చ జరుగుతోంది. సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) మాట్లాడుతూ... పహల్గాం దాడి అమానుష ఘటన అన్నారు. మతం పేరు అడిగి మరీ పర్యాటకులను చంపండం దారణమని పేర్కొన్నారు. భద్రతాసిబ్బంది నిన్న ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయని తెలిపారు. పవాల్గాం దాడి కీలక నిందితుడు సులేమాన్(Pahalgam Accused Suleman) హతమయ్యాడని అమిత్ షా పేర్కొన్నారు. మన భద్రతాదళాలు, జమ్ముకశ్మీర్ పోలీసులకు అభినందనలు తెలిపారు. పహల్గాం దాడి జరిగిన ప్రాంతానికి తాను వెంటనే వెళ్లానని అమిత్ షా చెప్పారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వారిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుందని చెప్పారు. పవాల్గాం దాడిలో దొరికిన తుపాకీ, బుల్లెట్లను ఎఫ్ఎస్ఎల్ కు పంపామన్నారు. ఫోరెన్సిక్ నివేదిక ద్వారా అనేక విషయాలు తెలిశాయని చెప్పారు. అమాయక పౌరులపై దాడులు చేస్తే మా ప్రతిస్పందన గట్టిగా ఉంటుందని తేల్చిచెప్పారు.
విపక్ష ఎంపీల వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని చెప్పిన అమిత్ షా(Amit Shah) ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో ఒకసారి ఆలోచించాలని పేర్కొన్నారు. పవాల్గాం దాడి బాధితులను కలిసి వారి బాధలు తెలుసుకున్నానని అమిత్ షా తెలిపారు. పహల్గాం దాడి ఘటనను వెంటనే ఎన్ఐఏకు అప్పగించామని చెప్పారు. శాస్త్రీయ దార్యాప్తు జరపడంలో ఎన్ఐఏకు మంచి పేరు ఉందని తెలపారు. ఉగ్రవాదులు పాక్(Pakistan) నుంచే వచ్చారనేందుకు ఆధారాలున్నాయా అని చిదంబరం(Chidambaram) ప్రశ్నించారని గుర్తు చేసిన ఆయన మీరు పాకిస్థాన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. పాక్ నుంచి వచ్చారనేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. ఉగ్రవాదుల నుంచి పాక్ లో తయారైన పత్రాలు, చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఇలా మాట్లాడటం తగదని హితువు పలికారు.