24-05-2025 03:58:07 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ కి చెందిన నిర్గూల్ వార్ మోరేశ్వర్ గౌడ్ 28 ఏళ్ల వయస్సులోనే ఆర్టీసీలో డ్రైవర్ గా కొలువు సాధించాడు. చిన్న వయసు లోనే తండ్రి అనారోగ్యంతో మరణించగా, తల్లికి తోడుంటూ ఆయనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇది వరకు ప్రైవేటు వాహనము నడుపుతూ జీవనం కొనసాగించేవాడు. ఇటివలే ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగాల నియామకానికి అప్లై చేయాగ ఉద్యోగం రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నెల రోజుల పాటు ట్రైనింగ్ పూర్తి చేసి అన్నింటిలో రాణించాడు. ప్రస్తుతం ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోలో బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. భగవంతుడి దయ వల్ల తాను పడిన కష్టానికి తగిన ఫలితం లభించిందని ఆయన మనస్పూర్వకంగా సంతోషిస్తున్నాడు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ గా బాధ్యతతో విధులు నిర్వహిస్తాననీ, ప్రయాణికులను గమ్యానికి చేరుస్తూ అటు ఆర్టీసీ సంస్థకు మంచి పేరు తెచ్చేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా మోరేశ్వర్ గౌడ్ తెలిపారు.