calender_icon.png 24 May, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పింఛన్లు పెంచాలని తహాసిల్దార్ కు వినతి

24-05-2025 03:53:50 PM

టిడిపి నాయకులు

మందమర్రి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఇచ్చిన హామీ ప్రకారం ఫించన్లు  పెంచాలని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు టిడిపి నాయకులు మండల తహాసిల్దార్ సతీష్ కుమార్ కు శనివారం వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.

గత 2023 సంవత్సరంలో జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వృద్ధాప్య,వితంతు, ఒంటరి మహిళలకు ఫించన్లు, రూ.4 వేలకు, దివ్యాంగుల ఫించన్లు రూ.6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి, అధికారం చేపట్టి 18 నెలలు గడిచినప్పటికీ ఫించన్లు  పెంపు హామీ కలగానే మిగిలిపోయిందని ఆయన అవేదన వ్యక్తం చేశారు.

వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఫించన్లు పెంపుదల చేస్తూ వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మండల తహశీల్దార్ కు అందచేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చాట్లపెల్లి రాజేశం, విహెచ్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పెద్దపల్లి సత్యనారాయణ, బీఎస్పి చెన్నూరు నియోజక వర్గం అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్ లు పాల్గొన్నారు