calender_icon.png 11 January, 2026 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్యాక్రాంతమైన భూములు స్వాధీనం

10-01-2026 12:31:29 AM

లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

ఆదిలాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): పేదలు, గిరిజనులకు ప్రభుత్వం కేటాయించిన భూములను అక్రమంగా ఆక్రమించినా, తప్పుడు మార్గాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టర్ క్యాం పు కార్యాలయంలో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఇతరుల పేరిట అక్రమంగా బదిలీ అయిన భూములను స్వాధీనం చేసుకుని, అసలైన లబ్ధిదారులకు కలెక్టర్ పట్టాలు అందజేశారు.

ఈ సమస్యల పరిష్కారంలో చొరవ చూపిన ఆర్డీఓ స్రవంతి, ఆదిలాబాద్ రూరల్, సిరికొండ తహశీల్దార్లు గోవింద్ నాయక్, తుకారాం లను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆయా మండలాల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.