calender_icon.png 18 August, 2025 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువులు కొనండి.. రక్షణ పొందండి

17-08-2025 12:58:09 AM

  1. ‘సంకట హరణ’ పేరుతో బీమా కల్పిస్తున్న ఇఫ్కో 
  2. రూ. 10 వేల నుంచి రూ. 2 లక్షల వరకు బీమా 
  3. రైతులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు 
  4. ఎరువులు కొనుగోలు చేసిన రసీదుతోనే బీమా వర్తింపు

హైదరాబాద్, ఆగస్టు 1౬ (విజయక్రాంతి): రాష్ట్రంలో వర్షాలు పడుతుండటంతో అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. రేయింబవళ్లు వ్యవసాయ క్షేత్రాలకు, వ్యవసాయ సామగ్రి కోసం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ సమయాల్లో రైతులు ప్రమాదాల బారిన పడితే ఆ కుటుంబం పడే ఇబ్బందులు, ఆర్థికంగా పడే పరిస్థితులు అన్నీ ఇన్నీ కావు. అప్పటికే ఆ రైతు అప్పుల్లో ఉంటే ఆ కుటుంబ పరిస్థితిని ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుం ది.

ఇలాంటి సమయాల్లో రైతులు ప్రమాదాల బారిన పడితే వారి కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే బీమా సదుపాయమే కాకుండా.. రైతులకు అండగా నిలిచేందుకు ఇఫ్కో అనే సంస్థ కూడా ముందుకు వచ్చింది. రైతుకు ప్రమాద తీవ్రతను బట్టి రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఆ సంస్థ ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తోంది.

ఆ సంస్థ వద్ద ఎరువులను సహకార సంఘాల నుంచి లేదా వ్యాపారుల నుంచి కొనుగోలు చేసే ప్రతి రైతుకు కూడా ఇఫ్కో సంస్థ ఉచితంగా ‘సంకటహరణ’ బీమా పథకాన్ని కొనుగోలు చేసిన తేదీ నుంచి 12 నెలల వరకు అమలు చేస్తోంది. ఈ బీమాకు రైతులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. రైతు ప్రమాదం బారిన పడి మరణించినా, అంగవైకల్యం కలిగినా ఈ బీమా వర్తిస్తుంది.

10 వేల నుంచి 2 లక్షల వరకు బీమా   

కాగా, రైతులు ఒక ఎరువు బస్తా, ఒక నానో ఎరువు యూరికా సీసా కొనుగోలు చేస్తే రూ. 10 వేల బీమా వర్తించేలా  పథకాన్ని రూపొందించారు. అలా గే 20 యూరియా బస్తాలు లేదా 20 నానో యూరి యా సీసాలు కొనుగోలు చేసిన వారికి రూ. 2 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. రోడ్డు ప్రమాదం, నీటిలో మునిగిపోవడం, పాము కాటు, గ్యాస్ సిలిండర్ పేలడం, ఏదైనా యంత్రం వల్ల కలిగే ప్రమాదాలకు ఈ బీమా వర్తింస్తుంది.

ఈ పథకంలో అర్హులుగా ఉన్న రైతులు మృతి చెందితే 100 శాతం, ఒక అవయవం కోల్పోతే 25 శాతం, రెండు అవయవాలు కోల్పోతే 50 శాతం పరిహారం అందుతోంది. ఎరువులు కొనుగోలు చేసిన నెల రోజుల నుంచి 12 నెలల వరకు ఇది అమలులో ఉంటుంది. 

రసీదు ఉంటేనే బీమా అవకాశం 

రైతులు ఎరువులు కొనుగోలు చేసినప్పుడు రసీ దు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ రసీదు ఉంటేనే బీమా ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది. బీమాను క్లెయిమ్ చేసుకోవడానికి రైతులు కొన్ని దృవీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. కేసు నమోదైతే ఎఫ్‌ఐఆర్ కాపీ, వైద్యుడి చికిత్స నివేదిక, పోస్టుమార్టం రిపోర్టు, మరణ దృవీవకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.

ప్రమాదం జరిగిన రోజు నుంచి రెండు నెలల్లోగా సికింద్రాబాద్‌లోని ఇఫ్కో టోకియో సాధారణ బీమా కంపెనీకి దృవపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇఫ్కో సంస్థ నుంచి ఎరువులు కొన్న రసీదును కూడా జత చేయాల్సి ఉంటుం ది. ఈ బీమా సదుపాయంపై రైతులకు ఎక్కువగా అవగాహన లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని, ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు సంబంధిత సంస్థ అధికారులు చెబుతున్నారు.