calender_icon.png 31 October, 2025 | 11:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు క్యాబినెట్ విస్తరణ

31-10-2025 12:54:49 AM

మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణానికి రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు 

ముహూర్తం: మధ్యాహ్నం 12:15 గంటలకు..

హైదరాబాద్, అక్టోబర్ 30(విజయక్రాంతి) : తెలంగాణ మంత్రివర్గ విస్తర ణకు ముహూర్తం ఖరారైంది. శుక్రవా రం మధ్యాహ్నం 12:15 గంటలకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్  మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్‌తో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ క్రమంలో ప్రభు త్వం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేసింది. ప్రమాణస్వీకారోత్సవం జరిగే రాజ్‌భవన్ దర్బార్‌హాల్‌ను ప్రోటోకాల్ అధికారులు పరిశీలించారు.

కాగా, 2023 డిసెంబర్ 7న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు 11 మం ది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత మరో ముగ్గురికి మంత్రులుగా అవకాశం ఇవ్వడంతో ఇప్పుడు మంత్రుల సంఖ్య 15కు చేరింది. ఇక మిగిలిన మూడు మంత్రి పదవులపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు చేసింది.

ఈ మూడు మంత్రి పదవుల్లో ఒకటి మైనార్టీ వర్గానికి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయం తీసుకున్నది, ఈ క్రమంలో పార్టీ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. అజారుద్దీన్‌కు హోం, మైనార్టీ శాఖ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇక మంత్రివర్గంలో మరో రెండు ఖాళీలకు అధిష్ఠానం ఎప్పుడు గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందో చూడాలి.