calender_icon.png 12 December, 2025 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీల్ చైర్‌లో దివ్యాంగురాలి ప్రచారం

11-12-2025 12:00:00 AM

మోతే, డిసెంబర్ 10 (విజయ క్రాంతి):-  మోతె  గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా  పల్లెల వనిత ఓటు కోసం వీల్ చైర్ లో ప్రచారం నిర్వహించడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేస్తున్న వనితకు భారత వికలాంగుల హక్కుల పరి రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ నెల 14 న గ్రామంలో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో పల్లెల వనిత డిగ్రీ వరకు చదువు కొని ప్రజా సేవ చేయడానికి ముందుకు వచ్చిన పల్లెల వనిత కు మీ అమూల్యమైన ఓటు వేయాలని గ్రామ ఓటర్లను అభ్య ర్ధించారు.

పంచాయతీ ఎన్నికలు డబ్బు మద్యం మాంసం చుట్టు తిరుగుతున్నాయని మండి పడ్డారు. ప్రజలు చాల చైతన్య వంతం కలిగిన వారని గ్రామంలో పని చేసే వారు   ఎవరు అనే విషయం ప్రతి ఓటరుకు గుర్తు ఉన్నదని చెప్పారు. 

ఉన్నత విద్యను అభ్యసించిన పల్లెల వనిత ను గెలిపిస్తే అభివృద్ధికి బాటలు వేస్తామని తెలిపారు. విద్యార్థులు మేధావులు రైతులు మహిళలు ఆలోసించి ఓటును వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి పల్లెల వనిత, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి జంజిరాల సుధాకర్, బొల్లం లింగయ్య యాదవ్, తురక నాగమ్మ, జిల్లేపల్లి శివ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.