calender_icon.png 13 December, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయి ఈశ్వరా చారి కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలి

11-12-2025 12:00:00 AM

బీసీ జేఏసీ డిమాండ్

హాజరైన బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్,  మాజీమంత్రి వి.  శ్రీనివాస్‌గౌడ్

గన్ పార్క్ వద్ద సాయి ఈశ్వరా చారికి కొవ్వొత్తులతో నివాళి

ముషీరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42% రేజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్య చేసుకొన్న సాయి ఈశ్వర చారి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని బీసీ జేఏసీ డిమాండ్ చేసింది.

ఈ మేరకు బుధవారం రాత్రి హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ కన్వీనర్ కుందారం గణేష్ చారి, నేతలు మణిమంజరి, బీసీ విద్యార్ధి సంఘం అధ్యక్షులు వేముల రామకృష్ణ  తదితరులు సాయి ఈశ్వరాచారి మృతికి సంతాప సూచికంగా కొవ్వతులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా సాయి ఈశ్వర చారి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని,  అలాగే  రాజ్యాంగంలోని 9 షెడ్యూల్ లో చేర్చి  బీసీ లకు 42% రేజర్వేషన్లు కల్పించాలని వారు  డిమాండ్ చేసారు.