12-12-2025 12:39:31 AM
హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి) : బీసీ రిజర్వేషన్ల అంశంపై ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్దకు అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ను పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, ఇతర బీసీ నాయకులు కోరారు.
కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి జాతీయస్థాయిలో బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేలా పోరాడాలన్నారు. గురువారం గాంధీభవన్‌లో మహేష్‌కుమార్‌గౌడ్‌తో సీనియర్ నేత వీహెచ్, పార్టీకి చెందిన బీసీ నాయకులు సమావేశమై 42 శాతంపై చర్చి ంచారు. కాంగ్రెస్ పరంగా బీసీ సంఘాలతో సమావేశాలు, రౌండ్‌టేబుల్స్, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చారు.