calender_icon.png 2 January, 2026 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచరామిలో కాలువ మరమ్మతులు పూర్తి

02-01-2026 01:15:54 AM

* రైతులకు ఊరట

సుల్తానాబాద్ జనవరి 1 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మం చరామి గ్రామంలో గత నాలుగు ఐదు సంవత్సరాలుగా చెరువు తూము కింద రైతుల పొలాలకు నీళ్లు వెళ్లే కాలువ పూర్తిగా కూలిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమస్యను గుర్తించిన గ్రామ సర్పంచ్ ఉ ప్పు లక్ష్మీ  సుమారు లక్ష రూపాయల వరకు సొంత ఖర్చులతో కాలువ బెడ్డు, సీసీ పనులను మరమ్మతులు చేయించారు.

మరమ్మతులు పూర్తవడంతో గురువారం రైతుల పొ లాలకు నీటిని విజయవంతంగా వదిలారు. దీంతో ఎండిపోతున్న పంటలకు మళ్లీ జీవం పోసినట్లయ్యిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించిన సర్పంచ్ కి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, రైతుల సంక్షేమమే లక్ష్యం గా సర్పంచ్ చేస్తున్న కృషి అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు.