02-01-2026 01:16:00 AM
మఠంపల్లి, జనవరి 1: మఠంపల్లి మండలంలోని చెన్నైపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన దిమ్మెపై కాంగ్రెస్ పార్టీ జెండాను మండల పార్టీ అధ్యక్షుడు భూక్యా మంజు నాయక్ గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సహాయ, సహకారాలతో ఊరిని మరింత అభివృద్ధి పథంలో నడిపించి ప్రతి పేద వాడిని సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరేలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్టి సెల్ జిల్లా అధ్యక్షుడు ధరవతు నవీన్ నాయక్, సర్పంచ్లు భూక్యా రవీందర్ నాయక్, జ్యోతి శ్రీనివాస్ నాయక్, భద్రమ్మ బాబు నాయక్, గ్రామ శాఖ అధ్యక్షుడు పూన్నా నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భీముడు నాయక్, సేవాలాల్ సేన అధ్యక్షుడు బానతో తులసిరాం నాయక్,మాజీ సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.