26-09-2025 12:00:00 AM
ప్రభుత్వ పాఠశాలలో ‘స్వచ్ఛతా హి సేవా’
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా కెనరా బ్యాంకు సర్కిల్ కార్యాలయం ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించారు. సర్కిల్ జనరల్ మేనేజరు కళ్యా ణ్ ముఖర్జీ సికింద్రాబాద్‌లోని మునగా రామమోహనరావు బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం ప్రారంభించారు.
పాఠశా ల ప్రాంగణంలో శుభ్రతా కార్యక్రమాలు నిర్వహించగా, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మనోహరాచార్య, కెనరా బ్యాంకు అధికారులు, సిబ్బం ది, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్.. శుభ్రత సమాజ అభివృద్ధికి పునాది అని, ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంపొందించడమే కాక భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన వాతావరణం అందించడమే లక్ష్యమని తెలిపారు.