calender_icon.png 26 September, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్కాజిగిరి అభివృద్ధికి నిధులు మంజూరు

26-09-2025 12:00:00 AM

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి 

మేడ్చల్, సెప్టెంబర్ 25(విజయక్రాంతి): మల్కాజిగిరి నియోజకవర్గం లో వివిధ అభివృద్ధి పనులకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. గురువారం వినాయక నగర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంజూరైన నిధుల వివరాలను వెల్లడించారు. వాజ్పేయి నగర్‌లో ఆర్‌యుబీ నిర్మాణానికి రూ.74.47 కోట్లు మంజూరయ్యాయని, ఇందులో జలమండలికి రూ.10 కోట్లు, భూ సేకరణకు రూ. 8 కోట్లు, విద్యుత్ శాఖకు రూ. మూడు కోట్లు, సర్వీస్ రోడ్లు, డ్రైనేజీకి రూ. 85 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు.

ఆర్ యు బి వెడల్పు 9 మీటర్లు, ఎత్తు ఐదు మీటర్లు, పొడవు 103 మీటర్లు నిర్మిస్తారని ఆయన వివరించారు. రామకృష్ణాపురం ఫ్లై ఓవర్ నిర్మాణానికి రూ. 210 కోట్లు, ఆర్ యు బి నిర్మాణానికి రూ. 35 కోట్లు, ఏవో సి అభివృద్ధికి రూ. 464 కోట్లు, భూమార్పిడికి రూ. 442 కోట్లు, తురకపల్లి ఆర్‌యుబీకి రూ.ఐదు కోట్లు, జనప్రి య ఆర్‌యుబీకి రూ.6.6 కోట్లు, గౌతమ్ నగర్ 5 ఎంఎల్‌డి రిజర్వాయర్‌కు రూ. 14.95 కోట్లు, జిల్లా కోర్టు భవన నిర్మాణానికి రూ.42 కోట్లు, డిగ్రీ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రెండు కోట్లు మంజూరయ్యాయి అన్నారు.

షఫీలు గూడ యూపీహెచ్సీకి 500 గజాలు, అల్వాల్ ఫైర్ స్టేషన్కు 11 గుంటలు జిహెచ్‌ఎంసి భూమి కేటాయింపు జరిగిందని ఆయన పేర్కొన్నారు. నిధుల మంజూరుకు సహకరించిన కలెక్టర్ మను చౌదరికి, రైల్వే, జిహెచ్‌ఎంసి, విద్యుత్ అధికారులకు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.