calender_icon.png 11 September, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-1 పరీక్ష రద్దు ప్రభుత్వానికి చెంపపెట్టు: బీఆర్‌ఎస్వీ

11-09-2025 01:21:44 AM

నంగనూరు, సెప్టెంబర్ 10: గ్రూప్-1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు, పరీక్ష కేంద్రాల కేటాయింపు, హాల్ టికెట్ల జారీ, ఫ లితాల్లోని అనుమానాల నేపథ్యంలో హైకో ర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీఆర్‌ఎస్వీ నంగునూరు మండల కోఆర్డినేటర్ తపట పర్షరాములు అన్నారు. నంగునూరు మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు బీఆర్‌ఎస్వీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దాసరి రమేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పర్షరాములు మాట్లాడుతూ, గతంలో కాం గ్రెస్ ప్రభుత్వం మన నీళ్లు, నిధులు, ఉద్యోగాలను కొల్లగొట్టగా, కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నామని గుర్తుచేశారు. కానీ, అధికారంలోకి వ చ్చిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ నీళ్లు ఆంధ్రకు, నిధులు ఢిల్లీకి, ఉద్యోగాలు అవినీతిపరులకు అప్పగిస్తోందని ఆరోపించారు.

దీనికి నిదర్శనమే గ్రూప్-1 పరీక్ష ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు అని ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశంలో బీఆర్‌ఎస్వీ నాయకులు ఏలేటి అనిల్ రెడ్డి,చింటు గౌడ్, తాటికొండ రాజు, ఇమ్రాన్, చౌదరి సంపత్ యాదవ్, బన్నీ, చిన్నా తదితరులు ఉన్నారు.